Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

దారుణం గర్భిణీ అయిన భార్యకు బలవంతంగా యూరియా తాగించి ఉరేసి చంపిన భర్త గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది

MOHAMMAD ASHRAF ALI

October 23, 2026 • 08:27 PM

దారుణం గర్భిణీ అయిన భార్యకు బలవంతంగా యూరియా తాగించి ఉరేసి చంపిన భర్త గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది
- Advertisement -

గుజరాత్‌లోని ఖేడా :దారుణం.. గర్భిణీ అయిన భార్యకు బలవంతంగా యూరియా తాగించి.. ఉరేసి చంపిన భర్త

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కడుపుతో ఉన్న భార్యపై అనుమానంతో కక్షగట్టిన భర్త.. వ్యవసాయంలో వినియోగించే లిక్విడ్ 'నానో యూరియా'ను బలవంతంగా తాగించి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పథకం వేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంచలన ఘటనకు సంబంధించి మహుధా పోలీసులు భర్త మితుల్ సోధా, అతని సోదరుడు విపుల్ సోధాలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలిని అరుణాబెన్‌గా గుర్తించారు. తొలుత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయితే, పోలీసుల దర్యాప్తు, పోస్టుమార్టం నివేదికలో ఆమెది ఆత్మహత్య కాదని, విష పదార్థం తాగడం వల్లే మరణం సంభవించినట్లు తేలింది. అరుణాబెన్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ భర్త మితుల్ సోధా, అత్త కైలాష్‌బెన్, బావ విపుల్ సోధా, మరదలు అల్పబెన్‌లు తరచూ మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారని మృతురాలి సోదరుడు వీరేంద్రసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇద్దరి మధ్య వివాహేతర సంబంధాలు, ఇతర విషయాలపై తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగే రాత్రి అరుణాబెన్, మితుల్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ఆత్మహత్య చేసుకుంటే భర్త బాధ్యతలపై మితుల్ ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్ శోధన (సెర్చ్) చేసినట్లు విచారణలో వెల్లడైంది. పథకం ప్రకారం అరుణాబెన్‌ను సోఫాపై పడుకోబెట్టి, భర్త మితుల్ బలవంతంగా నానో యూరియాను ఆమె నోట్లో పోశాడు. ఈ దారుణంలో మిగతా కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అరుణాబెన్ కాళ్లను అల్పబెన్, చేతులను కైలాష్‌బెన్ గట్టిగా పట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

- Advertisement -

అరుణాబెన్ మరణించిన తర్వాత ఈ ఘటనను ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితులు నాటకం ఆడారు. ఇంట్లోని వెనుక గది కిటికీకి నైలాన్ తాడుతో శవాన్ని వేలాడదీసి, ఆ తర్వాత కిందకు దించి ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. అంతేకాకుండా, విషం ఉన్న ప్లాస్టిక్ సంచిని వంటింటి పొయ్యిలో కాల్చి సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నం చేశారు. ఉదయం వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటన స్థలం నుంచి నైలాన్ తాడు, మొబైల్ ఫోన్, బ్లేడ్ తదితర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు మితుల్, విపుల్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా కుటుంబ సభ్యుల పాత్రపై, హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ఎవరెవరు సహకరించారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


- Advertisement -
Join Group
Translate Change Language